కాల్పుల విరమణకు రెండు షరతులు పెట్టిన రష్యా అధ్యక్షుడు

-

గత రెండు సంవత్సరాల నుంచి ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు.రష్యా విదేశాంగ శాఖ కార్యాలయంలో పుతిన్‌ మాట్లాడుతూ…కాల్పుల విరమణకు ఆదేశిస్తానంటూ ఉక్రెయిన్‌కు ఆఫర్ ఇచ్చారు. అయితే అందుకు 2 షరతులు విధించారు.

తమ స్వాధీనంలో ఉన్న 4 ప్రాంతాల్లో బలగాలను ఉపసంహరించుకోవాలని, నాటోలో చేరాలన్న ఆలోచనను విరమించుకోవాలని షరతు విధించారు. తుది పరిష్కారం కోసం ఈ ప్రతిపాదన తెచ్చినట్లు, ఎలాంటి ఆలస్యం లేకుండా చర్చలు ప్రారంభిస్తామని తెలిపారు. అయితే ఒకవైపు జీ7 దేశాలు ఇటలీలో సమావేశమైన నేపథ్యంలో ఈ ప్రకటన రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.ఉక్రెయిన్‌కు చెందిన దొనెట్స్క్‌, జపోరిజియా,లుహాన్స్క్‌, ఖేర్సన్‌ ప్రాంతాలు తమ దేశంలో విలీనమైనట్లు గతంలో రష్యా ప్రకటించింది. అయితే, ఈ చర్యను ఉక్రెయిన్‌, పశ్చిమదేశాలు ఖండించాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news