ఫేస్‌బుక్ కి నామినీ పెట్టుకోవచ్చు..

-

how to use legacy Option in facebook
నిద్ర లేచింది మొదలు ఇంటర్నెట్‌ ప్రపంచంలో విహరిస్తూ ఉంటాం. ఫేస్‌బుక్‌ ఉంటే చాలు పక్కనున్న ఫ్రెండ్‌ గురించి కూడా పట్టదు. ఫొటోలు, వీడియోలు, టెక్ట్స్ పోస్టులు ఫేస్‌బుక్‌లో పెట్ట‌డం, లైక్‌లు, కామెంట్లు కొట్టించుకోవ‌డం బాగా అలవాటేగా మనకు. అయితే మ‌నం జీవించి ఉన్నంత వ‌ర‌కు ఫేస్‌బుక్‌ను మ‌న‌మే వాడ‌తాం. మరి మ‌నం లేక‌పోతే..? అంటే చ‌నిపోతే..? అప్పుడు మ‌న ఫేస్‌బుక్ అకౌంట్‌ను ఎవ‌రు వాడ‌తారు..?

ఫేస్‌బుక్‌ లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫేస్‌బుక్‌ యూజర్లలో చనిపోయిన వారి అకౌంట్లు దాదాపు ౩ కోట్లు ఉన్నాయట. రోజుకు 8 వేల మంది ఫేస్‌బుక్‌ యూజర్లు చనిపోతున్నారని ఫేస్‌బుక్‌ సంస్థ అంచనా. మరి వారి అకౌంట్లలో అవసరమైన ఇన్‌ఫర్‌మేషన్‌ సంగతి ఏంటి? ఇదే విషయం ఫేస్‌బుక్‌ దృష్టికి వచ్చింది. ఇంకేం ఫేస్‌బుక్‌ లెగసీ కాంటాక్ట్‌ అనే ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.

ఈ లెగసీ కాంటాక్ట్ అనే ఫీచర్ ద్వారా యూజర్లు తాము తదనంతరం అకౌంట్ దానంతట అదే డిలీట్ అవ్వాలా? వద్దా? అనేది ముందుగానే నిర్ణయించుకోవచ్చు.

ఒక వేళ అకౌంట్ వద్దు అనే ఆప్ష‌న్‌ను ఎంచుకుంటే ఆ వ్యక్తి చనిపోయిన క్ర‌మంలో ఫేస్‌బుక్‌లో అతనికి ఫ్రెండ్స్‌గా ఉన్న స్నేహితులు, కుటుంబ సభ్యులు ఫేస్‌బుక్‌కు ఓ రిక్వెస్ట్ పంపితే చాలు, ఆ అకౌంట్ డిలీట్ అయిపోతుంది.

అకౌంట్ కావాలి, కొనసాగాలని అనుకుంటే లెగసీ కాంటాక్ట్‌లో యూజర్ తనకు అత్యంత క్లోజ్‌గా ఉన్న స్నేహితులు, కుటుంబ సభ్యుల్లో ఎవరిదైనా ఒక ఫేస్‌బుక్ ఐడీని ఆ కాంటాక్ట్‌లో ఇవ్వవచ్చు. దీంతో యూజర్ చనిపోయినప్పుడు లెగసీ కాంటాక్ట్‌లో ఇచ్చిన ఐడీ ప్రకారం సంబంధిత వ్యక్తులు చనిపోయిన వ్యక్తి ఫేస్‌బుక్ అకౌంట్‌ను నిర్వహించవచ్చు. కానీ ఆ అకౌంట్‌కి చెందిన‌ పూర్తి స్థాయి అధికారాలు ఉండ‌వు. అలాగే పాత పోస్టులు, ఇమేజ్‌లను డిలీట్ చేసేందుకు కూడా అవకాశం ఉండదు.

మీరూ మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లో లెగసీ కాంటాక్ట్‌ను యాడ్ చేయాలనుకుంటే ఫేస్‌బుక్‌లోకి వెళ్లి సెట్టింగ్స్ – జ‌న‌ర‌ల్ – మేనేజ్ అకౌంట్ – ఎడిట్ ఆప్ష‌న్‌లోకి వెళ్లి పైన ఉండే యువ‌ర్ లెగ‌సీ కాంటాక్ట్ చాయిస్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అందులో వ‌చ్చే బాక్స్‌లో ఫేస్‌బుక్‌లో మీకు ఫ్రెండ్స్‌గా ఉన్న ఎవ‌రినైనా యాడ్ చేయ‌వ‌చ్చు. ఇక అక్క‌డే కింద ఉండే రిక్వెస్ట్ అకౌంట్ డిలిష‌న్ అనే ఆప్ష‌న్‌ను యూజ‌ర్ ఎంచుకుంటే అత‌ను చ‌నిపోయాక అత‌ని ఫ్రెండ్స్ నుంచి ఫేస్‌బుక్‌కు అందే మెసేజ్‌తో ఆ యూజ‌ర్ అకౌంట్ ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతుంది. అయితే మీకు బాగా దగ్గరి వారినే లెగసీ కాంటాక్ట్ ఐడీలుగా ఇవ్వండి. లేదంటే ఇతరుల చేతిలోకి మీ సమాచారం వెళ్లే ప్రమాదం ఉంటుంది. మనం ఉన్నా, లేకపోయినా మన సమాచారం మాత్రం విలువైందే కదా!

Read more RELATED
Recommended to you

Latest news