స్టైలిష్ లుక్ లో సీఎం చంద్రబాబు.. ఫోటోలు వైరల్

-

తెలుగుదేశం పార్టీ మంగళగిరిలోని కేంద్ర కార్యాలయానికి ఈరోజు(శనివారం) సీఎం చంద్రబాబునాయుడు వచ్చారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబును కలిసేందుకు టీడీపీ కార్యాలయానికి అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు.2024లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఈ క్రమంలో మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.

మంగళగిరిలో ఏర్పాటుచేసిన సమావేశానికి వచ్చిన ఓ మహిళ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తమ అధినేత చంద్రబాబు నాయుడులో హీరోను చూడాలనుకున్న ఆమె ‘పెట్టుకోండి సార్’ అంటూ బ్లాక్ గ్లాసెస్ ఇచ్చారు. ఆమె కోరికను కాదనని ముఖ్యమంత్రి చంద్రబాబు వాటిని ధరించి ఫొటోకు పోజులిచ్చారు. ఆ క్షణం ఉత్సాహానికి గురైన ఆమె జై బాబు అంటూ నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news