రాజధాని అభివృద్ధికి పక్కా ప్రణాళిక సిద్ధంగా ఉంది :మంత్రి నారాయణ

-

అమరావతిని అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దుతామని మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని అభివృద్ధిపై శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…”రాజధాని అభివృద్ధికి పక్కా ప్రణాళిక సిద్ధంగా ఉంది. వచ్చే రెండున్నర సంవత్సరాలలో నిర్మాణం పూర్తవుతుంది అని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం అని అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి కేవలం 58 రోజుల్లోనే 34 వేల ఎకరాలను రైతులు అందజేశారు.

 

కేవలం అప్పటి సీఎం చంద్రబాబుపై నమ్మకంతోనే స్వచ్ఛందంగా రైతులు ముందుకొచ్చారు అని అన్నారు.గతంలో రూ.48వేల కోట్లతో రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులకు టెండర్లు ఆహ్వానించాం గుర్తు చేశారు. రూ.9వేల కోట్లతో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు, రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ తదితర మౌలిక వసతులు కల్పించాం అని మంత్రి నారాయణ తెలిపారు.సీఎం చంద్రబాబునాయుడు మరోసారి రాజధానిని అభివృద్ధి చేసే బాధ్యతను నాపై ఉంచారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తా అని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news