భారీగా దేవర మూవీ థియేట్రికల్ బిజినెస్

-

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’.ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది.త్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో దేవర డిస్ట్రిబ్యూషన్ హక్కుల మొత్తం రూ.110 కోట్లు ఉండవచ్చునని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా థ్రియేటికల్ హక్కులను ఆంధ్ర ప్రదేశ్ లో సితారా ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకోగా.. తెలంగాణాలో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ సొంతం చేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ హక్కుల విలువ రూ.110 కోట్లు కాగా.. ఓవర్సీస్ హక్కులు మరో రూ.27 కోట్లుగా అంచనా వేస్తున్నారు. కాగా, ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా న‌టిస్తుంది విషయం తెలిసిందే. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని రెండు పార్ట్ లుగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి జూనియర్ ఎన్టీఆర్ లుక్‌తో పాటు, సైఫ్ అలీఖాన్, జాన్వీకపూర్ లుక్‌ల‌ను రిలీజ్ చేయ‌గా….. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.తారక్ ఈ మూవీ లో తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నారు. ఇక అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news