విశాఖను రాజధాని అని గంజాయికి రాజధాని చేశారు: హోం మంత్రి అనిత

-

విశాఖను రాజధాని అని గంజాయికి రాజధాని చేశారని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. తాజాగా ఆమె అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఇన్నాళ్లు రాష్ట్రంలో గంజాయి బ్యాచ్ రాజ్యమేలింది. విచ్చలవిడిగా గంజా అమ్మాకాలతో గ్రామాల్లోని యువత మత్తుకు బానిసలు అయ్యారు.

ఈ క్రమంలోనే ఇవాళ అమరావతిలో వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణాల తక్షణమే ఆపేయాలని అనిత స్మగ్గరకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. లేని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఫైర్ అయ్యారు. గంజాయి అంతు తేల్చేందుకే. హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందే సమీక్ష నిర్వహించానని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖను గంజాయికి రాజధాని చేశారని ధ్వజమెత్తారు. మూడు నెలల్లో విశాఖలో గంజాయి అనే పదం వినబడకుండా చేస్తానని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.  వైసీపీ ప్రభుత్వ పోలీసుల పర్యవేక్షణ లోపించడంతో విచ్చలవిడిగా అక్రమార్కుల దందా మూడు పువ్వు కాయలుగా కొనసాగింది.  మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఫుల్ ఫోకస్ పెట్టింది నూతన ప్రభుత్వం. గంజాయి తరలించే వారు ఎంతటి వారైనా వెంటనే కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరచాలని పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది హోంమంత్రి అనిత.

Read more RELATED
Recommended to you

Latest news