రైతుబంధు ఆపి…ఆ డబ్బును రుణమాఫీ కోసం వాడేందుకు కుట్రలు – నిరంజన్‌ రెడ్డి

-

రైతుబంధు ఆపి…ఆ డబ్బును రుణమాఫీ కోసం వాడేందుకు కుట్రలు చేస్తున్నారని రేవంత్‌ సర్కార్‌ పై మాజీ మంత్రి నిరంజన్‌ రెడ్డి ఆగ్రహించారు. రైతాంగం ను కాంగ్రెస్ సర్కార్ ధగా చేస్తుందని మండిపడ్డారు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రైతు బంధు,రుణమాఫీ అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమని… కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడవ సీజన్ వచ్చింది…రైతు బంధు సరిగ్గా ఇవ్వడం లేదని మండిపడ్డారు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

కొండలు ,గుట్టలకు రైతు బంధు BRS ప్రభుత్వం ఇచ్చింది అని అంటున్నారు… ఆ లెక్క తేల్చేందుకు సమయం అంటూ రైతు బంధు ను ఆలస్యం చేస్తుంది ఈ ప్రభుత్వం అంటూ విమర్శలు చేశారు. మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సార్లు రైతు బంధు ఇచ్చాం అని అంటున్నారు కదా ? అని నిలదీశారు. ఒక కోటి 52 లక్షల మందికి BRS సర్కార్ రైతు బంధు ఇచ్చింది.. రైతు బంధు ఎగగొట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తున్నదని ఫైర్‌ అయ్యారు. రైతు బంధు ఆపి…ఆ డబ్బును రుణమాఫీ కోసం వాడాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని మండిపడ్డారు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news