సభలో అర్థవంతమైన చర్చ జరగాలి : స్పీకర్ అయ్యన్న పాత్రుడు

-

ఆంధ్రప్రదేశ్ శాసన సభలో ఇవాళ స్పీకర్ గా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడారు. కొంత మంది మాట్లాడిన తరువాత స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభ గురించి చర్చించారు.

సభలో అర్థవంతమైన చర్చ జరగాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు కోరారు. ఇందులో అపర మేధావులు ఉన్నారని.. అందరూ కలిసి సభను సజావుగా.. ప్రజల సమస్యలను చర్చించాలని కోరారు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఉంటే సభ హుందాగా ఉండేదని తెలిపారు. ముఖ్యంగా బడ్జెట్ స్పీచ్ మేము కొత్తగా ఎన్నికైనప్పుడు ట్రైనింగ్ ఇచ్చారు. సభలో అపారమైన అనుభవం కలిగిన వ్యక్తులున్నారు. ఆ అనుభవాన్ని ఉపయోగించి సభను ముందుకు తీసుకెళ్లాలి. ఈ ఐదేళ్ల పాటు మనకు ఉన్నది పదవీ కాదు.. బాధ్యతలా భావించాలన్నారు స్పీకర్. అనంతరం అసెంబ్లీ సభను నిరవధిక వాయిదా వేశారు. ఎల్లుండి కేబినేట్ సమావేశం నిర్వహించనున్నారు. 8 శ్వేత పత్రాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news