నీట్ పేపర్ లీక్ పై కేంద్రం విచారణ జరుపుతోంది : ఎంపీ రఘునందన్ రావు

-

నీట్ పేపర్ లీక్ పై కేంద్రం విచారణ జరుపుతోందని బీజేపీ ఎంపీ రఘునందన్ వెల్లడించారు. గతంలో మన్మోహన్ సింగ్ ప్రతిపాదించిన ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ను మోడీ ప్రభుత్వం రద్దు చేసిందని చెప్పుకొచ్చారు. అయితే ఐటీఐఆర్ కింద ప్రతిపాదించిన అన్ని పనులను కేంద్రం పూర్తి చేసిందని తెలిపారు. అటు కేసీఆర్ పైన ఆయన  విమర్శలు చేశారు. గొర్రెల స్కామ్, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కేసీఆర్ ఇంటికి ఈడీ అధికారులు రాక తప్పదని జోస్యం చెప్పారు.

raghunandhan rao

నీట్ పరీక్ష పై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా కండువా కప్పుకున్న రోజు నుంచే పార్టీ కార్యకర్త అన్నారు. కొత్తగా వచ్చిన నేతలకు పదవి రాదు అనేది ఏమి లేదు.  హిమంత బిశ్వ శర్మకు సిఎం పదవి వచ్చింది అని తెలిపారు. కొత్త, పాత అనేది ఏమి లేదు. పార్టీలో చేరినప్పటి నుంచి సామార్థ్యాన్ని, స్థాయిని బట్టి అధిష్టానం పదవులు ఇస్తుందని తెలిపారు. నిజాం షుగర్ ప్రాజెక్ట్ తిరిగి తెరిపిస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news