రూ.14 లక్షల కోట్లకు చేరిన ఆంధ్రప్రదేశ్‌ అప్పులు ?

-

Andhra Pradesh’s debts reached Rs. 14 lakh crore: రేపు ఉదయం 10 గంటలకు ఏపీ కేబినెట్ తొలి సమావేశం జరుగనుంది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రాధాన్యతలపై సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేయనున్నారు. హామీల అమలు, రాజధాని, పోలవరం నిర్మాణాలపై కీలక చర్చ జరుగనుంది. ఎనిమిది శాఖలపై శ్వేతపత్రాల విడుదలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Andhra Pradesh’s debts reached Rs. 14 lakh crore

ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రత్యేకంగా చర్చించనుంది చంద్రబాబు నాయుడు మంత్రివర్గం. ఏపీకి రూ.14 లక్షల కోట్లకు పైగా అప్పుల భారం ఉందని ఇప్పటికే ప్రభుత్వానికి చేరిందట సమాచారం. గత ప్రభుత్వంలోని అవినీతిపై విచారణ చేపట్టే అంశంపై ఏపీ కేబినెట్ భేటీలో కీలక ప్రస్తావన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. నిజంగానే ఏపీకి రూ.14 లక్షల కోట్ల కు పైగా అప్పుల భారం ఉంటే… చంద్రబాబు సర్కార్‌ ఎలా ఎదుర్కొబోతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news