ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై ఏపీ రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యాన్ని త్వరలోనే కల్పిస్తామన్నారు ఏపీ రవాణ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. అమరావతి సెక్రటేరీయేట్ లోని తన ఛాంబర్ లో రవాణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి…. వేద మంత్రోచ్ఛారణల మధ్య బాధ్యతలు తీసుకున్నారు.
అనంతరం ప్రకాశం జిల్లా దర్శి లో రూ.18.51 కోట్ల అంచనా వ్యయంతో డ్రైవింగ్ శిక్షణ రీసెర్చ్ సంస్థను ఏర్పాటు ఫైలుపై ఏపీ రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తొలి సంతకం చేశారు. అనంతరం ఏపీ రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ…. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యాన్ని త్వరలోనే కల్పిస్తామని… తెలంగాణ, కర్ణాటకల్లో అమలు చేస్తున్న ఉచిత బస్సు సౌకర్యం పధకంలో లోటు పాట్లు ఇక్కడ రాష్ట్రంలో తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.
నిరుపేద క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఏపీ రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.