రేపే ఇండియా ,ఇంగ్లాండ్ మధ్య సెమి ఫైనల్ మ్యాచ్.. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే..?

-

టీ 20 వరల్డ్‌కప్ టోర్నమెంట్ గ్రూప్ దశ, సూపర్-8 ముగించుకొని.. సెమీ ఫైనల్స్‌కు వచ్చేసింది. భారత కాలమానం ప్రకారం..జూన్ 27వ తేదీన ఉదయం 06:00 గంటలకు దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య తొలి మ్యాచ్ జరగనుండగా, ఆ తర్వాత రాత్రి 08:00 గంటలకు ఇండియా, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి.

అయితే ఎక్కువ మంది అభిమానులు మాత్రం ఇండియా, ఇంగ్లాండ్ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు.ఈ మ్యాచ్‌కి ఆతిథ్యమివ్వనున్న గయానాలో వరుణుడి ముప్పు కూడా పొంచి ఉంది. వెదర్ రిపోర్ట్స్ ప్రకారం.. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం 88% ఉంది. 18% పిడుగులు పడే అవకాశం కూడా ఉందని అంచనాలు సూచిస్తున్నాయి. దీంతో.. ఈ మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.ఈ మ్యాచ్ కి రిజర్వ్ డేని షెడ్యూల్ చేయలేదు కానీ.. 250 నిమిషాల అదనపు సమయం కేటాయించింది. ఒకవేళ నిరంతర వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే మాత్రం.. ఇంగ్లండ్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించి, ఇండియా ఫైనల్స్‌కు అర్హత సాధిస్తుంది. ఐసీసీ రూల్స్ ప్రకారం.. వర్షం కారణంగా సెమీ ఫైనల్ మ్యాచ్ రద్దయితే, అప్పుడు గ్రూప్ దశలో అగ్రస్థానంలో ఉన్న జట్లు ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news