కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఇంటికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

-

KTR consoled Congress MLA Medipalli Satyam: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఇంటికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంటికి వెళ్లారు కేటీఆర్. సతీమణి మరణంతో విషాదంలో ఉన్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కుటుంబాన్ని పరామర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

KTR consoled Congress MLA Medipalli Satyam

ఇక కేటీఆర్ వెంట ఎమ్మెల్యేలు వివేకా నంద్, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ వెళ్లారు. కాగా, చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపా దేవి ఆత్మహత్య చేసుకున్నారు. అల్వాల్ లోని పంచశీల కాలనీలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది రూపా దేవి. ఆత్మహత్యకు ముందు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు భార్య వీడియో కాల్ చేసిందని వార్తలు వస్తున్నాయి. కేసు నమోదు చేసుకొని ఆత్మహత్య కు గల కారణాలపై విచారణ చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news