BREAKING: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి 14 రోజుల రిమాండ్

-

 

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బిగ్‌ షాక్‌ తగిలింది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానంలో వాదనలు విన్నారు న్యాయమూర్తి. ఈవీఎం ధ్వంసం సహా ఓటర్లను భయపెట్టి , దాడి చేసిన నాలుగు కేసుల్లో విచారణ నిర్వహించారు.

The High Court will hear the Pinnelli Ramakrishna Reddy EVM vandalism case today

ఈ సందర్భంగా రెండు కేసుల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు అయింది. కానీ… మరో రెండు కేసుల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రిమాండ్ విధించారు న్యాయమూర్తి. అనంతరం మాజీ ఎమ్మెల్యే వైకాపా నేత పిన్నెల్లి ని నెల్లూరు జైలుకు తరలించాలని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news