కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు . ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. పార్టీని వీడి దొంగలతో కలిసేటోళ్ల గురించి తమకు ఏమాత్రం బాధ లేదని కేసీఆర్ అన్నారు.
శుక్రవారం ఎర్రవల్లి ఫాంహౌజ్‌లో మీడియాతో కేసీఆర్ మాట్లాడుతూ.. పార్టీ కొత్త నాయకులను తయారు చేస్తుందని.. నాయకులు పార్టీని ప్రభావితం చేయలేరని అన్నారు. నాడు అయినా..నేడు అయినా నాయకులను తయారు చేసుకున్నది పార్టీనే అని కేసీఆర్ గుర్తు చేశారు. మెరికల్లాంటి యువ నాయకులను పార్టీ సృష్టిస్తుందంటూ ఆయన తెలిపారు. తెలంగాణ సాధించిన తమకు అదో లెక్క కాదని అన్నారు. రెట్టించిన ఉత్సాహంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దామని నాయకులకు, కార్యకర్తలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు.