ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది.. అప్పటికేసీఎం, డిప్యూటీ సీఎంల ప్రమాణస్వీకారం, శాఖల కేటాయింపు..బాధ్యతల స్వీకరణ అంతా జరిగిపోయింది.అయితే, కొందరు మంత్రులు ఇప్పటికే తమకు కేటాయించిన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు.. మరికొందరు సంబంధిత శాఖల కార్యాలయాల్లో బాధ్యతలు చేపట్టారు. అయితే, ఇప్పుడు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) మరికొందరు మంత్రులకు రాష్ట్ర సచివాలయంలో ఛాంబర్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి బ్లాక్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు కొనసాగుతోన్న విషయం విదితమే .
కాగా.. గతంలో ఫైనాన్స్ మినిస్టర్ ఛాంబర్, పేషీని ఇప్పుడు డిప్యూటీ సీఎంకు కేటాయించారు. మంత్రి పయ్యావులకు గతంలో కేఈ వినియోగించిన పేషీ, ఛాంబర్ కేటాయించగా.. మంత్రులకు కేటాయించిన ఛాంబర్లు, పేషీల నంబర్లతో జీవో జారీ చేసింది జీఏడీ.ఇక, మంత్రులు నాదెండ్ల మనోహర్,నారా లోకేష్, అచ్చెన్నాయుడు, పి. నారాయణ, కొల్లు రవీంద్ర ,వి. అనిత, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్య ప్రసాద్,కందుల దుర్గేష్,నిమ్మల రామానాయుడు, ఫరూక్, పయ్యావుల కేశవ్, కొలుసు పార్థసారథి, బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, సంధ్యారాణి, బీసీ జనార్ధన్, టీజీ భరత్,రాంప్రసాద్‌రెడ్డి,సవిత, సుబాష్, శ్రీనివాస్.. ఇలా మంత్రులకు కేటాయించిన ఛాంబర్లు.. కింద జీవోలో చూడొచ్చు.