సర్కారు బడిలో ఏసీ క్లాస్ రూమ్స్.. చల్లచల్లగా పాఠాలు

-

సాధారణంగా సర్కారు బడుల్లో కనీస వసతులు ఉండవు. కొన్ని పాఠశాలల్లో అయితే విద్యార్థులకు తరగతులు కూడా ఉండవు. చెట్ల కింద పాఠాలు చెబుతుంటారు ఉపాధ్యాయులు. ఇక ఇంకొన్ని ప్రభుత్వ పాఠశాల్లో మంచినీరు, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలు కూడా కరువే. కానీ ఓ ప్రాంతంలోని సర్కారు బడిలో ఏకంగా ఏసీ క్లాస్రూమ్లే ఉన్నాయి. నమ్మశక్యంగా లేదు కదూ. మరి ఇది ఎక్కడో తెలుసుకుందాం రండి.

పశ్చిమ బెంగాల్లోని ముషీరాబాద్ జిల్లా కందిలో ఉన్న రాషోర అంబికా హైస్కూల్లో విద్యార్థుల కోసం క్లాస్రూమ్ల్లో ఏకంగా ఏసీలు అమర్చారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా క్లాస్రూమ్ల్లో వేడికి విద్యార్థులు ఇబ్బంది పడటమే గాక అనారోగ్యానికి గురవుతున్నారు. దీంతో విద్యార్థుల హాజరు తగ్గిపోయింది. రోజురోజుకు ఈ సంఖ్య పెరగడంతో దీన్ని నివారించేందుకు అక్కడి ఉపాధ్యాయులు ఓ చల్లని ప్లాన్ వేశారు.

స్కూల్ హెడ్ మాస్టర్, టీచర్స్ కలిసి సమావేశాలు నిర్వహించి, చివరకు క్లాస్రూమ్ల్లో ఏసీలు బిగించాలని నిర్ణయించి ఈ విషయాన్ని కంది మున్సిపాలిటీ ఛైర్మన్, స్థానిక ఎమ్మెల్యేకు చెప్పారు. టీచర్ల చందా, విరాళాలతో రూ.3.75లక్షల ఖర్చు చేసి 8 ఏసీలు కొనుగోలు చేసి తరగతి గదుల్లో అమర్చారు. దీంతో పిల్లలంతా చల్లచల్లగా పాఠాలు వింటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news