Former cricketer Gautam Gambhir visited Tirumala Srivari: తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. నిన్న రాత్రి తిరుమలకు వచ్చిన మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్.. ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 20-20 వర్డల్ కప్ విజయంతో 140 కోట్ల భారతీయులకు గర్వకారణమని ఈ సందర్భంగా పేర్కొన్నారు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్.
ద్రావిడ్, రోహిత్ శర్మ, ఇండియా టీంకు అభినందనలు తెలిపారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇండియా టీంకు ఎనలేని సేవలు అందించారని కొనియాడారు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. 20-20 ఫార్మాట్ నుంచి రిటైర్ అయినా….వన్డే,టేస్ట్ మ్యాచ్ లలో వారి ఆటను కొనసాగిస్తారన్నారు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. కాగా, రాహుల్ ద్రావిడ్…టీమిండియా కోచ్ పదవి కాలం దాదాపు ముగిసింది. దీంతో ద్రావిడ్ స్థానం లో మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్… టీమిండియా కోచ్ గా రాబోతున్నారట.