T 20 :టీమిండియా జింబాబ్వే టూర్ షెడ్యూల్ ఇదే !

-

5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం టీమిండియా జింబాబ్వేలో పర్యటించనుంది.ఈ పర్యటన ఈ నెల (జులై) 6 నుంచి ప్రారంభము కానుంది. హరారే వేదికగా జులై 6, 7, 10, 13, 14 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి.ఈ సిరీస్‌ కోసం భారత సెలెక్టర్లు సీనియర్లు సూర్యకుమార్‌, హార్దిక్‌,పంత్‌, అక్షర్‌ పటేల్‌కు విశ్రాంతి కల్పించారు.కోహ్లి, రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజా రిటైర్మెంట్‌ ప్రకటించారు కాబట్టి వారిని పరిగణలోకి తీసుకోలేదు.

ఇక శుభ్‌మన్‌ గిల్‌ టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వరల్డ్‌కప్‌ ట్రావెలింగ్‌ రిజర్వ్‌ ప్లేయర్లలోని రింకూ సింగ్‌, ఖలీల్‌ అహ్మద్‌,ఆవేశ్‌ ఖాన్‌ ఈ సిరీస్‌కు ఎంపికయ్యారు. ప్రపంచకప్ జట్టులోని సభ్యులు యశస్వి జైస్వాల్‌, సంజూ శాంసన్‌,శివమ్‌ దూబే కూడా ఈ పర్యటనకు ఎంపికయ్యారు. రియాన్‌ పరాగ్‌,అభిషేక్‌ శర్మ, తుషార్‌ దేశ్‌పాండే కొత్తగా జట్టులోకి వచ్చారు. ఈ సిరీస్‌ సోనీ స్పోర్ట్స్‌ టెన్‌ 4 (తమిళం/తెలుగు), సోనీ స్పోర్ట్స్‌ టెన్‌ 3 (హిందీ) SD & HD, సోనీ స్పోర్ట్స్‌ టెన్‌ 5 SD & HD ఛానల్‌లలొ ప్రత్యక్ష ప్రసారం కానుంది.

జింబాబ్వే సిరీస్‌కు ఇండియా జట్టు..

శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌, యశస్వి జైస్వాల్‌,రింకూ సింగ్‌, శివమ్‌ దూబే,రియాన్‌ పరాగ్‌, వాషింగ్టన్‌ సుందర్‌,అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌, దృవ్‌ జురెల్‌, ఆవేశ్‌ ఖాన్‌,రవి బిష్ణోయ్‌, ముకేశ్‌ కుమార్‌,ఖలీల్‌ అహ్మద్‌, తుషార్‌ దేశ్‌పాండే

Read more RELATED
Recommended to you

Latest news