గిరిజన రైతుపై పోలీసుల రౌడీయిజం.. జై భీమ్ చిత్రాన్ని తలపించేలా..?

-

గిరిజన రైతుపై పోలీసుల రౌడీయిజం చూపించారు.  జై భీమ్ చిత్రాన్ని తలపించేలా చోటు చేసుకున్నది.   కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన గిరిజన రైతు కుతాడి కనకయ్య(35)పై చేయని దొంగతనం అంటగట్టి పోలీసుల చిత్రహింసలకు గురి చేశారు. గత నెల 11న కనకయ్య నిద్రిస్తుండగా ఉదయం 4 గంటల సమయంలో పోలీసులు రామడుగు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి కర్రలు, బెల్టులతో కొట్టి చిత్రహింసలకు గురిచేసి 12న రాత్రి 10 గంటలకు ఇంటి దగ్గర వదిలేశారు.

అనారోగ్యం పాలైన కనకయ్య కొలుకోగానే గత నెల 26 తేదీన కనకయ్యను మళ్లీ రామడుగు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఎస్ఐ, 8మంది పోలీసులు కలిసి కనకయ్యను నెలపై బోర్ల పడుకోబెట్టి కాళ్లు, చేతులు కట్టేసి, వీపుపై నిలబడి, అరి కాళ్లపై కర్రలతో కొట్టి తీవ్ర చిత్రహింసలు పెట్టారు. గొర్రెల దొంగతనం చేశావని ఒప్పుకోవాలని, లేదంటే చంపేస్తామని చిత్రహింసలకు గురిచేయడంతో కనకయ్య తనకు ప్రాణహాని ఉందని ఎస్ఐ, కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని మానవ హాక్కుల సంఘానికి, డీజీపీని కలిసి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news