తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ మను సింఘ్వి వెళ్లే ఛాన్స్ కనిపిస్తోంది. కే. కేశవరావు (కేకే) రాజీనామాతో ఖాళీ అయింది ఒక స్థానం. అసెంబ్లీ సంఖ్యాబలం ప్రకారం కాంగ్రెస్‌కు దక్కనుంది ఆ స్థానం. ఆ సీటును సీనియర్ నేత సింఘ్వీకి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుందని సమాచారం. కొద్ది నెలల క్రితం హిమాచల్ నుంచి రాజ్యసభ బరిలోకి దిగిన సింఘ్వీ దిగారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయడంతో ‘టై’గా ముగిసింది ఫలితం. అయితే… టాస్ వేసి గెలుపును నిర్ణయించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ టాస్‌లో ఓటమిపాలైన అభిషేక్ మను సింఘ్వి.. నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి ఏర్పడే ఖాళీని సింఘ్వీతో భర్తీ చేయాలని భావిస్తోంది కాంగ్రెస్ అధిష్టానం.
తన స్థానం ఖాళీ చేసి ఇచ్చిన కేకేకు… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవి రానుందట. కేబినెట్ హోదాతో ప్రభుత్వ సలహాదారుగా నియమించే అవకాశం ఉందని సమాచారం. మీడియాతో చిట్‌చాట్‌లో ఈ విషయాన్ని తెలిపారట సీఎం రేవంత్ రెడ్డి.