హరహరే మైదానంలో జింబాబ్వేతో తొలి T20లో భారత్ 13 రన్స్ తేడాతో ఓడిపోయింది. 116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక 102 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ గిల్ (31) రన్స్ చేయగా.. మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. అభిషేక్, రింకూ డకౌట్ కాగా.. అవేశ్ 16, బిష్ణోయ్ 9, రుతురాజ్ 7, జురెల్ 7, పరాగ్ 2 పరుగులు చేశారు. చివర్లో సుందర్ 27 పరుగులు చేసినా ఫలితం లేకపోయింది. ఈ విజయంతో 5 టీ20ల సిరీస్లో జింబాబ్వే 1-0తో ఆధిక్యం సాధించింది.
కాగా, మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 115 రన్స్ చేసింది. క్లైవ్ మదాండే(25 నాటౌట్) 3 పోరాటంతో ఆ జట్టు 100 రన్స్ చేసింది. డియోన్ మైయర్స్ (23), బ్రియాన్ బెన్నెట్(23), వెస్లీ మాథెవెరే(21), కెప్టెన్ సికందర్ రజా(17) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. నలుగురు ప్లేయర్లు డకౌట్ అయ్యారు.టీమిండియా బౌలర్లలో రవి బిష్ణోయ్ 4 వికెట్లు, సుందర్ 2, అవేశ్, ముకేశ్ తలో వికెట్ల తీశారు.