Telangana :జీవో 317పై హెల్త్ మినిస్టర్ కీలక వ్యాఖ్యలు

-

వైద్యారోగ్యశాఖలో జీవో 317కు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని మంత్రి దామోదర రాజనర్సింహా వెల్లడించారు. శనివారం ఆయన హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో 317 బాధిత ఉద్యోగ సంఘాలతో సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. ఉద్యోగుల స్థానికత, ప్రెసిడెన్షియల్ ఆర్డర్, జిల్లాల విభజన, జోన్, మల్టీ జోనల్, స్పౌజ్ బదిలీల అంశాలపై చర్చించామని తెలిపారు. 317 జీవో బాధిత ఉద్యోగుల శాశ్వత పరిష్కారం చూపేందుకు క్యాబినెట్ సబ్ కమిటీ త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. ఈ జీవో సమస్యల పరిష్కారంపై క్యాబినెట్ సబ్ కమిటీ అతి త్వరలో సీఎంకు తుది నివేదిక ఇవ్వనున్నదని అన్నారు. ఉద్యోగులెవ్వరూ ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ఉద్యోగులకు మేలు చేసే నిర్ణయాలు ఉంటాయని ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news