ఏలూరులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో 4 గురు స్పాట్ లోనే మృతి చెందారు. ద్వారక తిరుమల సమీపంలో లక్ష్మీ నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్ లారీని ఢీ కొట్టింది ఓ కారు. ఇక ఈ కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు మృతి అక్కడిక్కడే మరణించారు. మరో బాలుడి పరిస్థితి విషమంగా మారింది.
విజయవాడ వైపు నుంచి రాజమండ్రి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. తెల్లవారుజామున డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. కారులో ప్రయాణిస్తున్న వారంతా మృతి చెందడం మరో బాలుడి పరిస్థితి విషమంగా ఉండడంతో మరిన్ని వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.