Y.S. Rajasekhara Reddy Jayanthi: నేడు YSR జయంతి. ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్మెంట్, జలయజ్ఞం, మహిళా సంఘాలకు పావలా వడ్డీ….. ఇలా వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరు చెబితే గుర్తొచ్చే పథకాలు ఎన్నో. వరుస ఓటములతో డీలా పడ్డ కాంగ్రెస్ పార్టీని 2004లో అధికారంలోకి తీసుకొచ్చారు వైయస్సార్. కేంద్రంలోనూ చక్రం తిప్పారు.
సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసి 2009లో రెండోసారి సీఎం అయ్యారు. అదే ఏడాది హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు. నేడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి ఉన్న తరుణంలోనే…ఇవాళ ఉదయం 7:30 గంటలకు ఇడుపులపాయలోని వైయస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించునున్నారు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి.
నివాళులర్పించిన అనంతరం విజయవాడకు బయలుదేరి వెళ్లనున్నారు జగన్. అటు వైయస్సార్ జయంతి సందర్భంగా ఇడుపులపాయల్లోని వైయస్సార్ ఘాట్ వద్ద ఉదయం 8.30 గంటలకు నివాళులు అర్పించునున్నారు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ. అనంతరం తల్లితో కలిసి విజయవాడకు బయలుదేరి వెళ్లనున్నారు షర్మిల.