6 సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్

-

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాగునీటి రంగంపై ప్రత్యేక దృష్టి సారించారు. అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా వేగంగా ఆయకట్టుకు సాగునీరు అందించాలని సంకల్పించారు. 48వేల ఎకరాలకు వేగంగా సాగునీరు అందించే ఆరు ప్రాజెక్టులపై ఆయన ఫోకస్ పెట్టారు. తక్కువ ఖర్చు (రూ.241 కోట్లు)తో అసంపూర్తిగా ఉన్నవి పూర్తి చేయాలని నిర్ణయించారు.

రాష్ట్రంలో కృష్ణా, గోదావరి పరీవాహకాల్లో అర్ధాంతరంగా పనులు నిలిచిపోయిన ప్రాజెక్టుల వివరాలను నీటిపారుదల శాఖ ఇంజినీర్ల నుంచి తెప్పించుకుని పరిశీలించిన సీఎం .. రైతులకు సాగునీరు అందించాలంటే డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.పలు దఫాలుగా ఆరు ప్రాజెక్టులపై చర్చించిన ముఖ్యమంత్రి తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులు, వీలైనంత తొందరగా సాగునీటిని అందించేందుకు వీలున్న వాటిని చేపడితే రైతులకు మేలు జరుగుతుందని భావించారు. అందుకు అవసరమైన అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఇందులో భాగంగా గోదావరి పరీవాహకంలోని నీల్వాయి ప్రాజెక్టు, పింప్రి ప్రాజెక్టు, పాలెం వాగు, మత్తడి వాగు, ఎస్సారెస్పీ స్టేజీ 2, సదర్మట్‌ ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించారు.

Read more RELATED
Recommended to you

Latest news