వరంగల్ జిల్లా లో విషాదం చోటు చేసుకుంది. మాజీ సర్పంచ్ ని హత్య చేశారు కొందరు దుండగులు. ఈ సంఘటన వరంగల్ జిల్లాలో ఆదివారం రాత్రి జరిగినట్లు చెబుతున్నారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బురహానుపల్లి గ్గ్రామంలో హత్యకు గురయ్యాడు మాజీ సర్పంచ్ సూదుల దేవేందర్.
భూ తగాధాలు కారణంగా మాజీ సర్పంచ్ సూదుల దేవేందర్ హత్య జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు, పోలీసులు. ఇక ఈ సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు. మాజీ సర్పంచ్ సూదుల దేవేందర్ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక మాజీ సర్పంచ్ సూదుల దేవేందర్ హత్య గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.