వైఎస్‌ఆర్ జయంతి నేపథ్యంలో… తెలంగాణ సీఎం రేవంత్ ఈ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ రోజు జననేత, స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 75 వ జయంతి సందర్భంగా ఈ నెల 8వ తేదీ ఉదయం 10.30 గంటలకు పంజాగుట్ట చౌరస్తాలో వైస్సార్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పిస్తారు తెలంగాణ సీఎం రేవంత్. అలాగే ఉదయం 10 45 గంటలకు ప్రజా భవన్ లో వైస్సార్ గారి ఫోటో ఎక్సబిషన్ ఉంటుంది. అలాగే 11.15 గంటలకు గాంధీ భవన్ లో వైఎస్సార్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పిస్తారు.
ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్శి గారు, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్క గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు పాల్గొంటారు. దయచేసి కాంగ్రెస్ కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చి మహా నేతకు నివాళులు అర్పించాలని విజ్ఞప్తి చేస్తున్నామని ఎమ్మెల్సీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ (ఇంచార్జ్ ఆర్గనైజేషన్) మహేష్ కుమార్ గౌడ్ ప్రకటన ద్వారా తెలిపారు.