నేడు పెండింగ్ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ సమీక్ష

-

ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. అసంపూర్తిగా ఉన్న పాతప్రాజెక్టులు సహా.. ఇటీవలే మొదలై పూర్తికాని పాలమూరురంగారెడ్డి, తుమ్మిళ్ల, గట్టు ఎత్తిపోతల ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఆయకట్టుకు సాగునీరు అందించే దిశగా అడుగులు వేస్తున్నారు. మరోవైపు పెండింగ్ ప్రాజెక్టులపైనా సీఎం ఫోకస్ పెట్టారు. ఇవాళ పాలమూరు జిల్లాలో పర్యటించనున్న ఆయన ఈ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉదండపూర్ జలాశయాల పనులు 60 శాతం పూర్తయ్యాయి. ఇప్పటి వరకు లక్ష్మీదేవిపల్లి జలాశయం పనులే ప్రారంభంకాలేదు. నెట్టెంపాడు కింద ర్యాలంపాడు జలాశయానికి అనుబంధంగా నిర్మిస్తున్న గట్టు ఎత్తిపోతల పథకం పనులు పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో పాలమూరు ప్రాజెక్టులపై సమగ్ర నివేదికను అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించనున్నారు. ప్రాజెక్టుల పూర్తికి ప్రధాన ప్రతిబంధకాలుగా ఉన్న నిధుల కొరత, భూసేకరణ, పునరావాస కల్పన అంశాలను అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. కాళేశ్వరం మాదిరిగా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసుకుని ఎత్తిపోతల పథకాల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news