ఈనెల 11న డీఎస్సీ హాల్టికెట్లు విడుదల

-

డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు ఈనెల 11వ తేదీ సాయంత్రం నుంచి వెబ్‌సైట్లో అందుబాటులో ఉండనున్నాయి. వాటిని అభ్యర్థులు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నర్సింహారెడ్డి తెలిపారు. ఈనెల 18వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీవరకు ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు నిర్వహిస్తామని ఇటీవలే విద్యాశాఖ పూర్తిస్థాయి షెడ్యూల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు సమయం చాలా తక్కువ ఇచ్చారని, దానికి తోడు గ్రూపు-2 పరీక్షలు ఉన్నందున కనీసం నెలపాటు వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం దీనిపై స్పందించలేదు. మరోవైపు హాల్‌ టికెట్లను www.schooledu.telangana.gov.in అనే వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ప్రకటించింది. దీంతో పరీక్షల వాయిదా ఉండదని స్పష్టం చేసినట్లయ్యింది. మొత్తం 11,062 ఉపాధ్యాయ ఖాళీలకు డీఎస్సీ నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 29న సుమారు 11,062 పోస్టుల భర్తీకి సర్కారు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. మార్చ్ 4 నుంచి జూన్ 20 వరకు దరఖాస్తులు స్వీకరించిన విద్యాశాఖ, ఈ నెల 18 నుంచి కంప్యూటర్ ద్వారా పరీక్ష నిర్వహించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news