నేను ఈవీఎంను పగలకొట్టలేదని మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి వెల్లడించారు. పోలింగ్ రోజున తాను అసలు పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రానికి వెళ్లలేదని మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి పోలీసు కస్టడీలో చెప్పినట్లు తెలుస్తోంది. “నేను అసలు అక్కడికి వెళ్లలేదు. ఈవీఎం పగలగొట్టలేదు. నంబూరి శేషగిరిరావు ఎవరో కూడా నాకు తెలియదు.
ఆరోజు నా వెంట గన్ మెన్లు లేరు”అని ఆయన సమాధానం ఇచ్చినట్లు సమాచారం. మొత్తం 50 ప్రశ్నలు అడగ్గా…. వాటిలో 30 ప్రశ్నలకు తెలియదనే చెప్పారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై మరో కేసు నమోదయింది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై పీసీ సెక్షన్ 323 కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
కోర్టులోకి తీసుకెళ్లే సమయంలో పిన్నెల్లికి ఎదురువచ్చాడు టీడీపీ కార్యకర్త కొమెర శివ. ఈ సమయంలో పిన్నెల్లిపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. కానీ పోలీసులు అలర్ట్ అయ్యారు. కానీ అంతులోనే.. కొమెర శివను కడుపులో గుద్దారు పిన్బెల్లి రామకృష్ణారెడ్డి. పోలీసులు జోక్యం చేసుకోవడంతో.. పరిస్థితి సద్దుమణిగింది.ఈ తరుణంలోనే…పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై పీసీ సెక్షన్ 323 కింద కేసు నమోదు చేశారు.