సీఎం రేవంత్ నీ కలిసిన మహ్మద్ సిరాజ్.. టీమిండియా జెర్సీ గిఫ్ట్..!

-

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీం ఇండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ కలిశారు. ఇవాళ సీఎం నివాసంలో ముఖ్యమంత్రిని క్రికెటర్ సిరాజ్ మర్యాదపూర్వకంగా వచ్చి కలిశారు. టీ 20 ప్రపంచ కప్ సాధించినందుకు సిరాజ్ను ముఖ్యమంత్రి అభినందించారు. క్రమంలోనే క్రికెటర్కు సీఎం శాలువ కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి టీమ్ ఇండియా జెర్సీని సిరాజ్కు బహుకరించారు. ఈ కార్యక్రమంలో సీఎం తో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్, కాంగ్రెస్ నేత ముహమ్మద్ అజహరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

టీ20 వరల్డ్ కప్ 2024 టీమ్ ఇండియా గెలిచిన తర్వాత.. పేసర్ మహమ్మద్ సిరాజ్ ఇటీవల హైదరాబాద్ నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా సిరాజ్కు గ్రాండ్ వెల్కమ్ లభించిన సంగతి తెలిసిందే. మెహిదీపట్నం నుంచి ఈదహ్ గ్రౌండ్ లోని సిరాజ్ ఇంటి వరకు అభిమానులు ర్యాలీ తీశారు.

Read more RELATED
Recommended to you

Latest news