వైసీపీలో ప్రక్షాళన.. జగన్ షురూ చేశాడుగా!

-

తన ఓటమికి రకరకాల కారణాలు చెబుతూ వచ్చారు జగన్. తొలుత ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేశారు. టెంపర్ జరిగి ఉంటుందన్న అనుమాన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈవీఎంలను ఉపయోగించని వైనాన్ని ప్రస్తావించారు. పేపర్ బ్యాలెట్ తో ఓటింగ్ జరుగుతున్న విషయాన్ని గుర్తు చేశారు. అక్కడకు కొద్ది రోజుల తర్వాత చంద్రబాబు అమలు కాని హామీలు ఇచ్చారని.. అందుకే ప్రజలు మొగ్గు చూపారని చెప్పడం ప్రారంభించారు. ఓటమిని మాత్రం స్పష్టంగా అంగీకరించలేదు. అయితే ఇప్పుడిప్పుడే అసలు విషయాన్నీ గ్రహిస్తున్నారు.

పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ముఖ్యంగా పార్టీ నుంచి వెళ్లిపోదలుచుకున్న వారు వెళ్లిపోవచ్చని.. మళ్లీ పునర్నిర్మాణం చేపడతామని చెప్పుకొస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సిట్టింగులతో పాటు అభ్యర్థులను మార్చడం వల్లే ఓటమి ఎదురైందని గుర్తిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా సమన్వయకర్తలను మార్చి పార్టీ పునర్నిర్మాణం చేపట్టాలని జగన్ భావిస్తున్నారు. అటు ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పార్టీని నిర్మించాలని.. పూర్వ వైభవాన్ని తీసుకురావాలని తహతహలాడుతున్నారు. నియోజకవర్గాల బాధ్యులను మార్చుతున్నారు. తాజాగా వనమలూరు నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి జోగి రమేష్ ను అక్కడి నుంచి తప్పించారు. ఆయన స్థానంలో నియోజకవర్గ సమన్వయకర్తగా దేవ భక్తుని చక్రవర్తిని నియమించారు. 2019 ఎన్నికల్లో పెడన నుంచి గెలిచారు జోగి రమేష్. మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకున్నారు.

అయితే పెడనలో సర్వేలో ప్రతికూల ఫలితాలు రావడంతో.. ఆయనను పెనమలూరు కు మార్చారు. అయినా సరే జోగి రమేష్ వాటర్ ని తప్పలేదు. 2014 ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేశారు జోగి రమేష్. అది ఆయన సొంత నియోజకవర్గం. ఎన్నికల్లో కూడా మైలవరం నుంచి పోటీ చేయాలని భావించారు జోగి రమేష్. కానీ జగన్ అనూహ్యంగా వెనమలూరు నుంచి పోటీ చేయాలని ఆదేశించారు. అయితే ఇది ఒక్క జోగి రమేష్ తో ఆగదని.. రాష్ట్రవ్యాప్తంగా చాలామందిని మార్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news