నీట్ పేపర్ లీక్,పరీక్షల నిర్వహణలో అవకతవకలపై దేశవ్యాప్తంగా నిరసనలు , ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో సీబీఐ దూకుడు పెంచింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి బీహార్‌లో మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసింది సీబీఐ.తాజాగా సీబీఐ అరెస్ట్ చేసిన వారిలో ఒకరు నీట్ పరీక్ష రాసిన అభ్యర్థి కాగా, మరో నిందితుడు నీట్ పరీక్ష రాసిన ఓ అభ్యర్థి తండ్రి. తాజా అరెస్ట్‌లతో ఈ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 11కు చేరింది. కాగా, నీట్ పేపర్ లీకేజీ, గ్రేస్ మార్కుల కేటాయింపు దేశంలో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో ఈ కేసును కేంద్రము సీబీఐకి అప్పగించింది.
రంగంలోకి దిగిన సీబీఐ నీట్ ఇష్యూకు సంబంధించి మొత్తం 6 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసింది. బీహార్‌లోని ఎఫ్‌ఐఆర్ పేపర్ లీకేజీకి సంబంధించింది .కాగా,రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రలకు చెందినవి అభ్యర్థుల మోసానికి రిలేటేడ్ కేసులు. తాజా అరెస్టులతో నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో అరెస్ట్‌లు 11కు చేరింది. బీహార్‌లో 8 మంది, మహారాష్ట్ర,గుజరాత్, ఉత్తరాండ్ రాష్ట్రాలలో ఒక్కొక్కరిని సీబీఐ అరెస్ట్ చేసింది.