అమరావతి ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఏపీ సీఎం చంద్రబాబు చొరవతో ఇప్పటికే ఈస్ట్రన్ బైపాస్ రోడ్డుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓటమి చెందడంతో వైసీపీ అధికారం చేజిక్కించుకుంది. వైసీపీ హయాంలో ఈ ప్రాజెక్టు పై అంత దృష్టి పెట్టలేదు అని సమాచారం. 2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో మళీ రాష్ట్ర ప్రజల ఆశలు చిగురించాయి. అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డు కు ఇప్పటికే అనుమతి ఇచ్చిన కేంద్రం..ఈ ఏడాది బడ్జెట్లోనే నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. 189 KM ఔటర్ రింగ్ రోడ్డుకు రూ.25 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేయగా ఈ సారి బడ్జెట్లో రూ.5- 10వేల కోట్లు కేటాయించే అవకాశముందని సమాచారం.
భూసేకరణ సహా అన్ని ఖర్చులను కేంద్రమే భరించనుంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి వెళ్లే ఈ ఔటర్ రింగ్ రోడ్డును 6 లైన్లతో ఎక్స్ప్రెస్ వేగా అభివృద్ధి చేయనున్నారు. రాజధాని అమరావతిలో లాజిస్టిక్, రహదారుల అభివృద్ధి, మౌలిక సదుపాయాలను కల్పించడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి చెప్పారు. ఈ క్రమంలోనే 25,000 కోట్ల రూపాయల విలువ చేసే అతిపెద్ద ప్రాజెక్టును అమరావతికి మంజూరు చేశారని తెలిపారు