జీ తెలుగు రిపోర్టర్ పై పోలీసులు దాడి !

-

జీ తెలుగు రిపోర్టరర్ శ్రీ చరణ్ అరెస్టు అయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీలో గత కొద్ది రోజుల నుంచి ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. కవరేజ్ కోసం వెల్లిన జీ తెలుగు విలేకరీని, కెమెరా మెన్ ను పోలీసులు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. ఓయూలో కవరేజ్ కోసం వెళ్లిన జీ తెలుగు రిపోర్టర్‌ను చొక్కా పట్టుకొని లాక్కెళ్లి వాహనం ఎక్కించారు పోలీసులు.

జర్నలిస్ట్ ని గల్ల పట్టుకొని గుంజుకొని పోవడం దుర్మార్గమని పలువురు జర్నలిస్టులు పేర్కొంటున్నారు. పోలీసులు విలేకర్ల గొంతులు నొక్కుతున్నారని, ఉస్మానియా యూనివర్సిటీని ముట్టడిస్తామని జర్నలిస్ట్ సంఘాలు పేర్కొంటున్నాయి. నిరుద్యోగులకు అండగా ఉంటున్న జర్నలిస్టుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా వ్యవహరించడం దుర్మార్గమని పలువురు బీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు. జర్నలిస్ట్ ని నా పని నేను చేసుకుంటాను.. మీ పని మీరు చేసుకోండి అని పేర్కొన్నారు జర్నలిస్ట్ శ్రీ చరణ్.  ఆ కోపంతోనే  పోలీస్ స్టేషన్ కి తరలించినట్టు కొంత మంది పేర్కొనడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news