విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై ఆందోళన వద్దు : కేంద్రమంత్రి కుమారస్వామి

-

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో ఆందోళన అవసరం లేదని కేంద్ర పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అన్నారు. ఈ ప్లాంట్ దేశ ఆర్థికాభివృద్ధికి సహాయపడుతోందని తెలిపారు. విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన ఇవాళ (జులై 11వ తేదీ 2024) స్టీల్‌ ప్లాంట్‌ను పరిశీలించారు. ఆయనతో పాటు మరో కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ కూడా విశాఖ ఉక్కు పరిశ్రమలోని వివిధ విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్టీల్‌ ప్లాంట్‌లోని వివిధ విభాగాలను ఉన్నతాధికారులు మంత్రులకు వివరించారు.

అనంతరం కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై అనేక మంది ఆధారపడి ఉన్నారని కుమారస్వామి అన్నారు. దీన్ని రక్షించడం తమ బాధ్యత అని తెలిపారు. ప్లాంట్‌ మూతపడుతుందనే ఆందోళన వద్దని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులతో వంద శాతం సామర్థ్యంతో ఉత్పత్తి జరుగుతుందని కుమారస్వామి వెల్లడించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కుమారస్వామి విజిటర్స్‌ బుక్‌లో తన అభిప్రాయాన్ని తెలియజేశారు. అంతకుముందు విశాఖ ఉక్కు పరిశ్రమలోని వివిధ విభాగాలను ఆయన పరిశీలించారు.

Read more RELATED
Recommended to you

Latest news