గన్నవరం మాజీ ఎమ్మెల్యేపై మరో కేసు నమోదు

-

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊహించని షాక్‌ తగిలింది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో మాజీ ఎమ్మెల్యే వంశీపై కేసు నమోదు అయింది.

vallabhaneni vamsi

ఈ కేసులో ఏ 71గా వంశీ పేరు చేర్చారు పోలీసులు. ఇప్పటికే ఈ కేసులో 15 మందిని అరెస్ట్ చేయగా రిమాండ్ విధించిన న్యాయస్థానం.. తాజాగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు చేశారు.

అటు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట లభించింది. సజ్జల రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, దేవినేని అవినాష్‌కు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగి రమేశ్‌కు బెయిల్‌ ఇచ్చింది. తదుపరి విచారణను ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news