అమెరికా జంట ప్రేమ పెళ్లి ఇది నిజంగా అద్భుతమే..!!!

-

ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళ మధ్య గొడవలు పడటం సర్వ సాధారణం. భార్యా భర్త గొడవలు పడుతూనే, ఒకరిపై ఒకరు మరింత ప్రేమని పెంచుకుంటూ ఉంటారు. ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నా సరే చిన్నపాటి గొడవలు ఎంత అన్యోన్య దాంపత్యంలో అయినా ఉంటూనే ఉంటాయి. అయితే మరికొంత మంది ఏకంగా చిన్న చిన్న గొడవలకి విడాకుల వరకూ వెళ్ళిపోతారు. అమెరికాలో ఓ జంట ఇలానే చేసింది. అయితే

ఆ జంట విడిపోయారు కానీ ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమని వారి అహం దగ్గర అవ్వనివ్వలేదు. ఇలా సుమారు 27 ఏళ్ళు గడిపేశారు. అయినా మనసులు అలానే ఉండిపోయాయి. వారి ఇద్దరి పేర్లు జేసన్ , వాలరీ. ఈ ఇద్దరు అమెరికాలోని మసాచుసెట్స్ కి చెందిన వాళ్ళు. ఓ కాఫీ షాపులో మొదటి సారిగా కలుసుకుని అక్కడే ప్రపోజ్ చేసుకుని పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత అదే కాఫీ షాపులో 1992లో  విడిపోయారు.

ఆ తరువాత ఇద్దరూ వేరేవేరే పెళ్ళిళ్ళు చేసుకున్నారు కానీ వారి జీవితాలలో ఎదో లోటు అందుకే ఎవరికి  వారు తమ జీవిత భాగస్వాములకి విడాకులు ఇచ్చారు. ఈ క్రమంలోనే జేసన్ ఒక వాలంటైన్ డే రోజున ఓ కార్యక్రమానికి వెళ్ళాడు. అదే పార్టీలో వాలరీ సింగర్ గా హరయ్యింది. దాంతో ఒకరిని ఒకరు చూసుకుని గతాన్ని గుర్తు చేసుకున్నారు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఎక్కడైతే విడిపోయారో అదే కాఫీ షాపులో మళ్ళీ పెళ్లి చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news