ట్రంప్ పై కాల్పుల ఘటన.. ఖండించిన ప్రధాని మోదీ

-

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై కాల్పుల ఘటనను ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. దీనిపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ  ఎక్స్‌ వేదికగా ఓ పోస్ట్‌ చేశారు. ‘‘నా స్నేహితుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయన త్వరగా కోలుకోవాలి. ప్రజాస్వామ్యం, రాజకీయాల్లో హింసకు తావులేదు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి’’ అని నరేంద్ర మోదీ ఆ పోస్టులో పేర్కొన్నారు.

ఇదీ జరిగింది..  పెన్సిల్వేనియాలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్రంప్‌పై గుర్తుతెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. వేదికపై ట్రంప్‌ మట్లాడుతుండగా ఒక్కసారిగా ఆగంతుకుడు తుపాకీతో కాల్పులకు తెగబడటంతో ఈ దాడిలో ట్రంప్‌ కుడి చెవికి బుల్లెట్‌ తగిలి గాయమైంది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, ట్రంప్‌ను సురక్షితంగా వేదికపై నుంచి తరలించారు. ఈ ప్రమాదంలో డొనాల్డ్‌ ట్రంప్‌ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ట్రంప్‌పై కాల్పులు జరిపిన వ్యక్తిని భద్రతా బలగాలు హతమార్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news