RRR మూవీ రికార్డ్ బ్రేక్ చేసిన ‘కల్కి’

-

పాన్ఇండియా స్టార్ ప్రభాస్ ‘కల్కి AD 2898’ మూవీ విడుదలైన రోజు నుంచి కలెక్షన్లు వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా పబ్లిక్ టాక్ కూడా సూపర్ గా ఉంది. విడుదలై పదిహేను రోజులు దాటినా ఇంకా థియేటర్లు హౌజ్ ఫుల్ గానే ఉంటున్నాయి. మరోవైపు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. రీసెంట్​గా వరల్డ్​ వైడ్​గా రూ.1000 కోట్ల మార్క్ క్రాస్ చేసింది.

వసూళ్లలో ప్రభంజనం సృష్టించిన కల్కి తాగాజా మరో ఘనత సాధించింది. రిలీజైన మూడు వారాల్లోనే రాజమౌళి బ్లాక్​బస్టర్​ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా హైదరాబాద్ లో ఫుల్​ రన్​ కలెక్షన్లను దాటేసి రికార్డు కొట్టింది. ‘ఆర్ఆర్ఆర్’ హైదరాబాద్​ నేషనల్ మల్టీప్లెక్స్ ఫుల్ కలెక్షన్లు రూ. 30.25కోట్లు కాగా,​ ఇదే రీజినల్​లో ‘కల్కి’ ఇప్పటికే రూ. 33.50కోట్లు వసూల్ చేసింది. 3 వారాల్లోనే ఆర్ఆర్ఆర్ కంటే కల్కి దాదాపు రూ.3 కోట్లు అధికంగా వసూళ్లు సాధించింది. ఇప్పటికీ కల్కి జోరు కొనసాగుతున్నందున ఈ కలెక్షన్లు మరింత పెరుగుతాయి. హైదరాబాద్ మల్టీప్లెక్స్​లో రూ.40కోట్ల మార్క్ టచ్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news