నిరుద్యోగులకు ఏమైనా సమస్యలు ఉంటే మంత్రులను కలవండి అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇవాళ కాటమయ్య రక్ష పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించారు. బీసీ కార్పొరేషన్ ద్వారా గౌడన్నలకు కాటమయ్య రక్ష కిట్లను పంపిణీ చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం లష్కర్ గూడ గ్రామంలో ఈ పథకాన్ని ప్రారంబించారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.
తాటి, ఈత వనాల పెంపు ప్రోత్సహించాలని.. ప్రతీ గ్రామంలో ఇందుకోసం 5 ఎకరాల భూమి కేటాయించాలన్నారు. రియల్ ఎస్టేట్ రంగం పెరగడం వల్లనే తాటివనాలు తగ్గుతున్నాయన్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా కొంత మంది మహిళలు, యువతులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరగా.. సీఎం మీ సమస్యలను తప్పకుండా వింటాం. ఎమ్మెల్యే, ఎంపీని మీ దగ్గరికి పంపిస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి. నిన్న, మొన్న కొందరు పిల్లలు పరీక్షలు వాయిదా వేయాలని అంటున్నారు. పిల్లలు రోడ్డు ఎక్కడం కన్నా ప్రభుత్వం వారి సమస్యలు వినడానికి సిద్ధంగా ఉంది. సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకొస్తే.. పరిష్కరిస్తామని హామి ఇచ్చారు రేవంత్ రెడ్డి.