నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పరీక్షల వాయిదా పై సీఎం రేవంత్ కీలక ప్రకటన..!

-

తెలంగాణలో డీఎస్సీ, గ్రూప్-2, 3 పరీక్షలను వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. పరీక్షల వాయిదాకు సంబంధించి నిరుద్యోగులు మంత్రులను కలిసి తమ సమస్యలు చెప్పాలన్నారు.. ఆ సమస్యలు పరిష్కరించే బాధ్యత మాది అని స్పష్టం చేశారు. డీఎస్సీ, గ్రూప్-2, 3 పరీక్షలను వాయిదా వేయాలని నిరుద్యోగులు చాలా రోజులుగా ఆందోళన చేస్తున్నారు. టెట్ నిర్వహణ తర్వాత డీఎస్సీకి తగిన సమయం లేదని ఆ నోటిఫికేషన్ కోసం అప్లై చేసుకున్న అభ్యర్థులు చెబుతున్నారు.

డీఎస్సీ, గ్రూప్-2, 3 పరీక్షల మధ్య చాలా తక్కువ గ్యాప్ ఉన్న నేపథ్యంలో రెండు పరీక్షలకు అప్లై చేసుకున్న వారు ఇబ్బంది పడతారని వాదిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు గ్రూప్-2, 3 పోస్టులను పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి..  నిన్న, మొన్న కొందరు పిల్లలు పరీక్షలు వాయిదా వేయాలని అంటున్నారు. పిల్లలు రోడ్డు ఎక్కడం కన్నా ప్రభుత్వం వారి సమస్యలు వినడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందరికీ రాకపోవచ్చు. కానీ కుల వృత్తులను, చేతి వృత్తులను బలోపితం చేసి వాళ్లకి అవకాశాలు కల్పిస్తే వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా నిలబడతాయి.

Read more RELATED
Recommended to you

Latest news