ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలు తీసుకోనున్న చంద్రబాబు ప్రభుత్వం

-

ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం..  ఏపీ కేబినెట్ సమావేశం ఇవాళ ఉదయం 11 గంటలకు జరగనుంది. అసెంబ్లీ సమావేశాలు, బీపీసీఎల్ రిఫైనింగ్ ప్రతిపాదనలు, ఇసుక పాలసీ విధివిధానాలు, తల్లికి వందనం, ఎక్సైజ్ పాలసీ, ఓటాన్ బడ్జెట్ తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించనున్నట్లు సమాచారం.

chandrababu cabinet meeting today

కేబినెట్ భేటీ అనంతరం సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్ళనున్నారు. అమిత్ షాను కలిసి విభజన సమస్యలపై చర్చించే అవకాశం ఉంది. కాగా, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి ఇవాళ వెళ్లనున్నారు. కేబినెట్ భేటీ తర్వాత గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు విమానంలో ఢిల్లీ వెళ్తారు.అక్కడి నుంచి నేరుగా కేంద్రహోంమంత్రి అమిత్ షా కార్యాలయానికి వెళనున్నారు.

ఆయనతో భేటీలో రాష్ట్రానికి సంబందించిన విషయాలపై చర్చించనున్నారు. విభజన నేపథ్యంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లనున్నారు చంద్రబాబు.రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కోరనున్నారు. త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ కి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేయనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news