డిప్యూటీ సీఎం భట్టికి చుక్కలు చూపించారు ఖమ్మం మహిళా రైతు. రైతు భోరోసా సాగు చేసే ప్రతి భూమికి ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టిని డిమాండ్ చేశారు ఖమ్మం మహిళా రైతు. రైతు భరోసా అమలుపై రైతుల అభ్యంతరాలను తీసుకుంటోంది రేవంత్ రెడ్డి సర్కార్. ఇందులో భాగంగానే.. రైతులతో భట్టి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టికి చుక్కలు చూపించారు ఖమ్మం మహిళా రైతు.
ఎన్ని ఎకరాలు ఉన్న సరే వ్యవసాయం చేసే రైతుకే రైతుభరోసా ఇవ్వండి.. ఎక్కడో కూర్చొని ఇక్కడ భూమి ఉన్న వాళ్లకి ఇవ్వకండి, సాగు చేసే వాళ్లేకే ఇవ్వండని డిమాండ్ చేశారు ఖమ్మం మహిళా రైతు. 5 ఎకరాలు, 10 ఎకరాలు నియమాలు పెడితే చాలా భూములు బీడు పారి పోతాయని ఆగ్రహించారు.
సాగు చేసే ప్రతి భూమికి ఇస్తాం అంటే ఆ 30, 50 ఎకరాలు ఉన్నవాళ్లు కూడా ఖాళీగా ఉంచితే రైతు భరోసా రాదని కనీసం కౌలు రైతుకైనా ఎంతో కొంత ఇచ్చి దున్నుకో పోండి అంటారన్నారు ఖమ్మం మహిళా రైతు. రైతు పడే కష్టంలో చిన్న పెట్టుబడి కోసం ఇచ్చేదే రైతుభరోసా అన్నారు ఖమ్మం మహిళా రైతు.
https://x.com/TeluguScribe/status/1812835217041977564