Beauty Tips: సాధారణంగా మనం ఎండలో బయటకు వెళ్లినప్పుడు మనం మొహంపై పెద్ద ఎత్తున టాన్ ఏర్పడుతుంది. తద్వారా మొహం మన అందాన్ని కోల్పోవడమే కాకుండా మన చర్మం ఎంతో నీరసించిపోయి ఉంటుంది. ఇలాంటి సమయంలోనే తిరిగి మన మొహం కాంతివంతం కావడానికి తిరిగి మన అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. ఇలా మన అందాన్ని రెట్టింపు చేయడంలో కలబంద ఎంతగానో దోహదం చేస్తుందని చెప్పాలి.
కలబందలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఆయుర్వేదంలో కలబందకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే మనం ఎండలో బయట తిరిగి టాన్ అయిన తర్వాత కలబందతో మన అందాన్ని పెంపొందించుకోవచ్చు దీనికోసం కలబంద గుజ్జు ఒక రెండు టేబుల్ స్పూన్లు తీసుకోవాలి అందులోకి ఒక టేబుల్ టీస్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని మెడ ముఖం చేతులపై అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకొని 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.
కలబంద గుజ్జులో చిటికెడు పసుపు, టేబుల్ టీ స్పూన్ తేనె, పాల మీగడ వేసి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్ వేసుకొని బాగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేయటం వల్ల మన చర్మం మొత్తం మృదువుగా తయారవ్వడమే కాకుండా పిగ్మెంటేషన్, మచ్చలు, మొటిమలు కాలిన గాయాలు వంటివి ఉన్నా కూడా తొలగిపోయి మరింత అందాన్ని పెంపొందిస్తుంది. ఇక మన చర్మం మృదువుగా తయారవడం కోసం కలబంద గుజ్జులో కీరదోస, పెరుగు గులాబీ నూనె కలిపి బాగా మసాజ్ చేయడం వల్ల చర్మం చాలా సున్నితంగా మారిపోతుంది.