దక్షిణ భారతదేశంలో తొలి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ కర్ణాటకలో ప్రారంభమైంది. రూ.449 కోట్లతో బెంగళూరులో నిర్మించిన ఫ్లైఓవర్‌ను ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభించారు.సౌత్ ఇండియాలో తొలి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌గా రికార్డు సృష్టించింది. 3.36 కిలోమీటర్ల పొడవైన ఈ ఫ్లైఓవర్.. సిల్క్ బోర్డు జంక్షన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ట్రాఫిక్‌ను సులభతరం చేయనుంది. వాహనాల రాకపోకల కోసం ఎగువ డెక్‌లో ఎలివేటెడ్ మెట్రో కారిడార్ మరియు దిగువ డెక్‌లో ఎలివేటెడ్ రోడ్డును కలిగి ఉంది.ఫ్లైఓవర్ రోడ్డు మరియు మెట్రో ఫ్లైఓవర్ కలిగి ఉంది.
సౌత్ ఇండియాలో ఇలాంటి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మించడం ఇదే తొలిసారి. ఈ ఫ్లైఓవర్ రాగిగుడ్డ మెట్రో స్టేషన్‌లో ప్రారంభమై సిల్క్‌బోర్డ్ జంక్షన్‌లో ముగుస్తుంది. ఫ్లైఓవర్‌తో పాటు వెళ్లే పసుపు లైన్ మెట్రో పనులు ఇంకా పూర్తికాలేదు. అయితే బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకారం ఇది ఈ సంవత్సరం డిసెంబర్‌లో ప్రారంభమవుతుంది. ఇక నగరంలోని ఏ వైపు నుంచి అయినా 30-40 నిమిషాల సమయం ఆదా అవుతుంది. రెండు ర్యాంప్‌ల నిర్మాణం మే 2025 నాటికి పూర్తి అవును.