రుణమాఫీ విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే.. వాళ్లని సంప్రదించాలి : పొన్నం ప్రభాకర్

-

రుణమాఫీలాంటి మంచి కార్యక్రమాన్ని ప్రశంసించడం చేతకాకపోతే కనీసం విమర్శించకుండా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కేటీఆర్, హరీష్ రావులను రిక్వెస్ట్ చేశారు.బుధవారం ప్రజాభవన్‌లో నిర్వహించిన కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రైతాంగానికి న్యాయం చేసేందుకు రూ.31 వేల కోట్లను బడ్జెట్‌లో పెట్టామని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు 60 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారని ఆయన గుర్తు చేశారు. ఆర్టీసీకి ఇప్పటికే ప్రభుత్వం రూ.2050 కోట్లు ఇచ్చామన్నారు.

ఆర్టీసీ స్వయం సమృద్ధిగా.. నష్టాలు లేకుండా నడుస్తోందని పొన్నం ప్రభాకర్ అన్నారు. 2005లో కేంద్రప్రభుత్వం దేశ వ్యాప్తంగా రూ.70వేల కోట్లు రుణమాఫీ కోసం ఖర్చు చేస్తే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రూ.31 వేల కోట్లను బడ్జెట్‌లో పెట్టిందని వెల్లడించారు. రుణమాఫీ విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే స్థానిక కాంగ్రెస్ నాయకులను, అధికారులను సంప్రదించాలని పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news