అమెరికా – హైదరాబాద్ విమానంలో 11 నెలల శిశువు మృతి 

-

అమెరికా నుంచి హైదరాబాద్‌ వస్తున్న విమానంలో 11 నెలల శిశువు ఊపిరాడక మృతి  చెందింది. విమాన సిబ్బంది ఆ పసికందును కాపాడటానికి  విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికి ఫలితం లేదు.  సిబ్బంది   ముందస్తుగా ఇచ్చిన సమాచారంతో  హైదరాబాద్‌ విమానాశ్రయంలో డాక్టర్‌, అంబులెన్స్‌ను సిద్దం చేశారు. లాండింగ్‌ అయిన వెంటనే హుటాహుటినా ప్రథమ చికిత్స చేస్తూ స్థానిక అపోలో మెడికల్‌ సెంటర్‌కు తరలించారు. కానీ అప్పటికే ఆ చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. ఈ  సంఘటన విమాన ప్రయాణికులను, సిబ్బందిని కలచివేసింది.

Read more RELATED
Recommended to you

Latest news