మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్.. ఈలలు వేయడమే…!

-

ఈల.. ఉత్సాహం, కేరింత కోసం వాడుతాం కదా. కానీ.. ఓ ఊళ్లో మాత్రం మాటలు, మాట్లాడుకోవడాలు ఉండవు. ఎవరు ఎవరితో మాట్లాడాలన్నా కేవలం ఈలలు మాత్రం వేసుకుంటారు. అంతే.. వినడానికి గమ్మత్తుగా ఉన్నా ఇది నిజం. మేఘాలయాలోని కోంగ్ తాంగ్ అనే ఊళ్లోనే ఈ వింత జరిగేది.

యూనిక్ టోన్స్ ఉపయోగించి ఎదుటి వాళ్లను పిలుస్తారు. వేరే వాళ్ల పేర్లను కూడా పిలవరట. వాళ్ల పేర్లకు ఓ ట్యూన్ ఉంటుందట. ఎవరిని ఏ ట్యూన్ తో పిలవాలో అదే ట్యూన్ తో పిలుస్తారు. దీంతో పేర్లు పెట్టి పిలవడాలు, మాట్లాడుకోవడాలు ఉండవు. ట్యూన్లతోనే వాళ్ల కమ్యూనికేషన్ ఉంటుంది. భలే వింతగా ఉంది కదా వీళ్ల భాష. ఇటువంటి ఈల భాషను టర్కీలోని ఓ గ్రామంలోనూ ఉపయోగిస్తారట. సూపర్ కదా.

Read more RELATED
Recommended to you

Latest news